Kuldeep Sengar: కోర్టు తీర్పు సందర్భంగా తీవ్రభావోద్వేగాలకు లోనై కన్నీళ్లు పెట్టుకున్న కుల్దీప్ సెంగార్

  • ఉన్నావో అత్యాచార ఘటనలో కోర్టు తీర్పు
  • దోషి కుల్దీప్ సెంగార్ కు జీవితఖైదు
  • మరణశిక్ష విధించి ఉండాల్సిందన్న బాధితురాలి కుటుంబసభ్యులు

దేశంలో సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనల్లో ఒకటిగా నిలిచిన ఉన్నావో వ్యవహారంలో బీజేపీ (బహిష్కృత) ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు జీవితఖైదు పడిన సంగతి తెలిసిందే. అయితే, ఢిల్లీలోని తీస్ హజారీ న్యాయస్థానంలో తీర్పు సందర్భంగా కుల్దీప్ సెంగార్ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. తన సోదరి, కుమార్తెతో కలిసి కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఉన్నావో బాధితురాలి కుటుంబసభ్యులు కోర్టు తీర్పుపై స్పందిస్తూ, సెంగార్ కు ఉరిశిక్ష విధించి ఉండాల్సిందని అన్నారు. అప్పుడే తమకు సంపూర్ణ న్యాయం జరిగినట్టు భావించేవాళ్లమని, అతడు జైల్లో ఉన్న సమయంలో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికామని తెలిపారు. అతడు జైల్లోంచి బయటికొస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

Kuldeep Sengar
Unnao
Uttar Pradesh
New Delhi
Police
Court
  • Loading...

More Telugu News