Pakistan: పాకిస్థాన్ మహిళకు భారత పౌరసత్వం మంజూరు
- గుజరాత్ లో పుట్టి పెరిగిన మహిళ హసీనా బెన్
- 1999లో పాక్ పౌరుడిని వివాహం చేసుకుంది
- భర్త మృతితో తిరిగి భారత పౌరసత్వం కోసం వినతి
జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలతో అట్టుడుకుతున్న వేళ ఓ పాకిస్థానీ మహిళకు భారత పౌరసత్వం మంజూరైంది. ఆమె అభ్యర్థన మేరకు భారత పౌరసత్వం మంజూరు చేసింది. గుజరాత్ లోని భాన్వాడ్ తాలూకాలో పుట్టి పెరిగిన మహిళ హసీనాబెన్.1999లో పాకిస్థాన్ కు చెందిన పౌరుడిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె పాక్ పౌరసత్వం పొందింది. తన భర్త మరణించడంతో ఆమె తిరిగి భారత్ కు రావాలని నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం కోసం మన ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న భారత ప్రభుత్వం అందుకు అంగీకరించింది. ఈ నెల 18న ద్వారక జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా భారత పౌరసత్వ ధ్రువపత్రాన్ని ఆమె అందుకున్నారు.