Andhra Pradesh: రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదిక సిద్ధం.. సీఎంను కలవనున్న కమిటీ
- నివేదిక సమర్పించడానికి సీఎం నివాసం వద్దకు చేరుకున్న కమిటీ
- 13 జిల్లాల్లోని ప్రజా సంఘాలు, రైతుల అభిప్రాయాల సేకరణ
- సీఎం సమక్షంలో నివేదిక అంశాలు వెల్లడయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్ లో రాజధానిపై నివేదిక రూపొందించేందుకు నియమించిన జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ నివేదికను సమర్పించడానికి సీఎం జగన్ గృహానికి చేరుకుంది. ఇటీవల సీఎం అసెంబ్లీలో మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ప్రస్తావించిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో రాజధానిపై అధ్యయనం చేయడానికి, నిపుణుల కమిటీని నియమించామని.. కమిటీ నివేదిక ప్రకారం నడుచుకుంటామని సీఎం జగన్ చెప్పారు.
తాజాగా జీఎన్ రావు నేతృత్వంలోని జీఎన్ రావు కమిటీ రాజధానిపై అధ్యయనంతో పాటు ప్రజాభిప్రాయం సేకరించి నివేదికను సమర్పించడానికి సీఎం జగన్ నివాసానికి చేరుకుంది. ఈ కమిటీలో డాక్టర్ కేటీ రవీంద్రన్, డా.మహవీర్, డా. అంజలికరోల్ మోహన్, డా. ఏవీ సుబ్బారావు, కేబీ అరుణాచలం, విజయమోహన్ సభ్యులుగా ఉన్నారు.