India: దేశభక్తిని గుర్తు చేస్తూ జాతీయ గీతం పాడిన పోలీసాఫీసర్.. భారీ ఆందోళనను విరమించి వెనక్కి వెళ్లిన నిరసనకారులు.. వీడియో ఇదిగో

  • కర్ణాటకలో ఘటన
  • సీఏఏకి వ్యతిరేకంగా బెంగళూరులో  నిరసన 
  • జాతీయ గీతం పాడించిన బెంగళూరు సెంట్రల్ డీసీపీ  

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీఛార్జ్ లు, అరెస్టులు చేస్తున్నప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. అయితే, ఓ పోలీసధికారి మాత్రం నిరసనకారుల్లో అప్పటికప్పుడు దేశభక్తిని నింపి వెనక్కి తిరిగేలా చేసి హీరో అయిపోయాడు.

కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఏఏకి వ్యతిరేకంగా బెంగళూరులో ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో వారిని అక్కడి నుంచి వెళ్లిపోమని పోలీసులు కోరారు. అయితే వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో బెంగళూరు సెంట్రల్ డీసీపీ చేతన్ సింగ్ రాథోడ్ జాతీయ గీతాన్ని పాడుతూ ఆందోళనకారులతో పాడించారు. అనంతరం ఆందోళనకారులు మనసు మార్చుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

India
Karnataka
caa
  • Loading...

More Telugu News