Nandamuri Balakrishna: టైటిల్ మాకిచ్చారు.. థ్యాంక్స్ టూ బోయపాటి: నందమూరి బాలకృష్ణ

  • రేపు విడుదల కానున్న ‘రూలర్’ 
  • ‘రూలర్’ టైటిల్ దర్శకుడు బోయపాటిది
  • మేము అడగగానే ఈ టైటిల్ మాకు ఇచ్చేశారు

ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన ‘రూలర్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ ఈ చిత్రం టైటిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘రూలర్’ టైటిల్ ని దర్శకుడు బోయపాటి శ్రీను ఎప్పుడో రిజిష్టర్ చేయించిపెట్టుకున్నారని చెప్పారు. ఈ టైటిల్ తమకు కావాలని నిర్మాత కల్యాణ్ అడిగిన వెంటనే అందుకు బోయపాటి వెంటనే అంగీకరించారని.. ‘థ్యాంక్స్ టూ బోయపాటి’ అన్నారు.

 ‘రూలర్’ అంటే ఒక రాజు మాత్రమే కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ కూడా రూలరే అని అన్నారు. తెలంగాణలో మొన్ననే మనం చూశాం.. అత్యాచార ఘటనలో నిందితులు పోలీసులపై దౌర్జన్యం చేస్తే వాళ్ల ఆత్మరక్షణ కోసం ఎన్ కౌంటర్ చేశారని, దేవుడే వాళ్లకు ఆ రూపంలో శిక్ష విధించారని అభిప్రాయపడ్డారు. కాగా, రూలర్ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్.  

Nandamuri Balakrishna
Hero
Ruler
Boyapati
  • Loading...

More Telugu News