Sai: 'అదిరింది' స్టేజ్ పైకి 'జబర్దస్త్' సాయి

  • ప్రియాంకగా మారిన సాయి 
  • కొంతకాలంగా 'జబర్దస్త్'కి బ్రేక్ 
  • 'అదిరింది'తో రీ ఎంట్రీ

'జబర్దస్త్' కామెడీ షో ఎంతో పాప్యులర్ అయింది. ఈ షో ద్వారా చాలామంది కమెడియన్స్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఈ స్టేజ్ పై లేడి గెటప్స్ తో రాణించిన వాళ్లూ ఎక్కువే. అలాంటి ఆర్టిస్టులలో సాయి ఒకరు. సాయి .. సాయితేజ పేరుతో లేడీ గెటప్పులో ఎన్నో స్కిట్స్ చేశాడు .. తనదైన శైలిలో నవ్వించాడు.

అలాంటి సాయితేజ 'జబర్దస్త్' కి బ్రేక్ ఇచ్చి, ఏడాది పాటు షూటింగులకు దూరంగా వున్నాడు. సర్జరీ ద్వారా పూర్తి అమ్మాయిగా మారిపోయి .. తన పేరును ప్రియాంకగా మార్చుకున్నాడు. ఇప్పుడు ప్రియాంకగా ఆయన 'అదిరింది' స్టేజ్ పై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలియజేశాడు. ధన్ రాజ్ .. ఆర్పీ .. వేణు .. చంద్ర టీమ్ లీడర్స్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీ ఎంట్రీతో ప్రియాంకగా సాయి ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి మరి.

Sai
  • Loading...

More Telugu News