Andhra Pradesh: మూడు రాజధానుల వ్యాఖ్యలు సీఎం అనుభవరాహిత్యానికి నిదర్శనం: కన్నా లక్ష్మీనారాయణ

  • అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలే తప్ప పరిపాలన కాదు
  • సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి
  • రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుంది

సీఎం జగన్ మూడు రాజధానుల వ్యాఖ్యలు అనుభవరాహిత్యానికి నిదర్శనమని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలే తప్ప పరిపాలన వికేంద్రీకరణ సరికాదని అన్నారు. ఇప్పుడిప్పుడే అమరావతిలో కుదురుకుంటున్న ఉద్యోగులు మళ్లీ విశాఖ వెళ్లడం సాధ్యంకాదని అభిప్రాయపడ్డారు. సీఎం తన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, పార్టీ తరపున ప్రతినిధి బృందాన్ని అమరావతికి పంపిస్తున్నట్టు తెలిపారు.

Andhra Pradesh
cm
Jagan
BJP
kanna
  • Loading...

More Telugu News