Ramachandra Guha: ఇంటర్వ్యూ మధ్యలో రామచంద్ర గుహను లాక్కెళ్లిన పోలీసులు

  • పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులో నిరసనలు
  • నిరసనల్లో పాల్గొన్న రామచంద్ర గుహ
  • కేంద్రం కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారన్న రామచంద్ర

ఓ ఛానల్ తో మాట్లాడుతున్న సమయంలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి లాక్కెళ్లి పోలీసు వాహనంలోకి ఎక్కించారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగళూరులో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోని టౌన్ హాల్ వద్ద నిరసనల్లో రామచంద్ర గుహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తుండగా మధ్యలోనే పోలీసులు లాక్కెల్లారు.

ఈ సందర్భంగా రామచంద్ర గుహ మాట్లాడుతూ, గాంధీ చిత్రపటాన్ని పట్టుకుని మీడియాతో రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నప్పుడు తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. కేంద్ర కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వివక్షతో కూడిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ అహింసాయుతంగా తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని... ఇక్కడెక్కడైనా మీకు హింసాత్మక ధోరణి కనిపిస్తోందా? అని ప్రశ్నించారు.

Ramachandra Guha
Bengaluru
Detained
  • Loading...

More Telugu News