Kamal Haasan: ఏ బిల్లూ వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదు: కమలహాసన్

  • పౌరసత్వంపై దేశవ్యాప్తంగా నిరసనలు
  • దీనిపై సుప్రీంను ఆశ్రయించిన కమల్
  • కేంద్రం నియంతృత్వ పోకడలు దురదృష్టకరమని వ్యాఖ్యలు

కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై కమలహాసన్ స్పందించారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న అంశంపై కేంద్రం సమీక్ష చేసుకోవాలని సూచించారు. ఏ బిల్లూ కూడా వెనక్కి తీసుకోలేనంత గొప్పది కాదని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేయని బిల్లులను వెనక్కి తీసుకునే అవకాశం ఉన్నా కేంద్రం ఆ పని చేయడం లేదని విమర్శించారు. ప్రజాభిప్రాయాలను పట్టించుకోకుండా కేంద్రం నిరంకుశ ధోరణి ప్రదర్శిస్తుండడం దురదృష్టకరమని కమల్ వ్యాఖ్యానించారు.

కమలహాసన్ ఇప్పటికే పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆయన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మద్రాస్ యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. అయితే ఆయనను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కమల్ ను లోపలికి అనుమతించకుండా పోలీసులు గేట్లకు తాళాలు వేశారు. దాంతో గేటు బయటే నిలుచుని విద్యార్థులతో మాట్లాడి వెనుదిరిగారు.

Kamal Haasan
CAA
NDA
Madras University
BJP
MNM
  • Loading...

More Telugu News