Pothireddypadu: పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణకు నీళ్లు రావు: కోదండరాం ఆందోళన

  • పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందన్న కోదండరాం
  • తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్
  • మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం ప్రమాదకరం అని టీజేఎస్ అధినేత కోదండరాం పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యం పెంచడం వల్ల తెలంగాణకు రావాల్సిన నీళ్లు రావని అన్నారు. హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 80,000 క్యూసెక్కులకు పెంచాలని ఏపీ సర్కారు ప్రణాళికలు రచిస్తోందని, అదే జరిగితే శ్రీశైలం ఖాళీ అవుతుందని కోదండరాం హెచ్చరించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని టీజేఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News