WI: ఛేదనలో మూడు వికెట్లు కోల్పోయిన విండీస్.. హోప్ ఆశావహ పోరాటం!

  • వైజాగ్ వన్డేలో టీమిండియా భారీ స్కోరు
  • విండీస్ టార్గెట్ 388 పరుగులు
  • బరిలో హోప్, పూరన్

వైజాగ్ వన్డేలో టీమిండియా గెలుపు కోసం ఉరకలు వేస్తోంది. 388 పరుగుల భారీ లక్ష్యఛేదనకు ఉపక్రమించిన వెస్టిండీస్ 24 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లకు 135 పరుగులు చేసింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ షాయ్ హోప్ మరోసారి అర్ధసెంచరీతో మెరిశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా మొండిపట్టుదలతో పోరాటం కొనసాగిస్తున్నాడు.

ఓపెనర్ ఎవిన్ లూయిస్ 30 పరుగులకు అవుట్ కాగా, స్టార్ బ్యాట్స్ మన్ హెట్మెయర్ 4 పరుగులతో నిరాశపరిచాడు. రోస్టన్ చేజ్ (4) సైతం స్వల్పస్కోరుకు వెనుదిరగడంతో విండీస్ 86 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకుంది. అయితే నికోలాస్ పూరన్ జతగా హోప్ భారత బౌలర్లపై ఎదురుదాడి చేయడంతో విండీస్ స్కోరు 100 మార్కు దాటింది. ప్రస్తుతం హోప్ 62, పూరన్ 29 పరుగులతో ఆడుతున్నారు. విండీస్ విజయానికి 26 ఓవర్లలో 253 పరుగులు చేయాలి.

WI
India
Cricket
Vizag
ODI
Hope
  • Loading...

More Telugu News