Andhra Pradesh: ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన ప్రకటనపై ‘హెరిటేజ్ ఫుడ్స్’ వివరణ

  • వ్యాపార విస్తరణకు భూములు కొనుగోలు చేశాం
  • అక్కడ భూములు కొనాలని 2014 మార్చిలోనిర్ణయించాం
  • ఆ తర్వాత మూడు నెలలకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది

అమరావతిలో ఎవరెన్ని ఎకరాలు కొనుగోలు చేశారన్న వివరాలను ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిన్న అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. హెరిటేజ్ సంస్థ కోెసం కంతేరులో 14.22 ఎకరాలు కొనుగోలు చేసిందంటూ వాటి సర్వే నెంబర్లు సహా బుగ్గన ప్రకటించారు. దీనిపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ వివరణ ఇచ్చింది. వ్యాపార విస్తరణలో భాగంగా గుంటూరు పరిసరాల్లో భూములు కొనుగోలు చేయాలని 2014 మార్చిలో నిర్ణయించుకున్నామని, ఆ తర్వాత మూడు నెలలకు 2014 జూన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొంది. కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్ పరిధిలో ఇప్పుడు 9.67 ఎకరాలు ఉన్నట్టు తెలిపింది. భూమిని మూడు దశల్లో 2014 జులై, ఆగస్టు నెలల్లో కొనుగోలు చేశామని వివరణ ఇచ్చింది.

Andhra Pradesh
Minister
Buggana
Heritage
  • Loading...

More Telugu News