Saina Nehwal: నాకు అద్భుతమైన భార్య లభించింది: సైనా భర్త కశ్యప్ వ్యాఖ్యలు

  • గతేడాది పెళ్లి చేసుకున్న సైనా, కశ్యప్
  • ఇవాళ తొలి పెళ్లిరోజు
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన కశ్యప్

అగ్రశ్రేణి క్రీడాకారులు తమ జీవితభాగస్వాములను క్రీడారంగం నుంచే ఎంచుకోవడం సాధారణంగా జరిగే విషయమే. భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ లు కూడా ఇలాగే వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. గతేడాది వాళ్ల వివాహం జరిగింది. ఇవాళ వాళ్ల తొలి పెళ్లి రోజు. ఈ సందర్భంగా కశ్యప్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు చేశారు. తానెప్పుడూ మంచి భార్య వస్తుందని ఆశించలేదని, కానీ అంతకంటే ఎక్కువగా అద్భుతమైన భార్య లభించిందని సైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. 'ఈ ప్రపంచంలో నువ్వో అమోఘమైన మహిళవి' అంటూ కితాబిచ్చాడు.

Saina Nehwal
Parupalli Kashyap
Badminton
India
Hyderabad
  • Loading...

More Telugu News