Jagan: తిరుపతిలో స్కిల్ డెవలప్ మెంట్ వర్సిటీ, విశాఖలో హైఎండ్ స్కిల్స్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ నిర్ణయం

  • క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష
  • స్కిల్ డెవలప్ మెంట్ పై నిర్ణయాలు
  •  నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఒకే గొడుగు కిందకు  

ఏపీ సీఎం జగన్ అధికారులతో స్కిల్ డెవలప్ మెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో పలు అంశాలపై చర్చించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం చొప్పున రాష్ట్రంలో 25 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, తిరుపతిలో స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఒకే గొడుగు కిందకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలను తీసుకువస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News