Ananthapuram: నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నా: చంద్రబాబునాయుడు

  • సమాజంలో మార్పు కోసం రాజకీయాలు ఉండాలి
  • ఎన్టీఆర్ కు, నాకు గుర్తింపు తెచ్చింది కార్యకర్తలే
  • అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశం

నిస్వార్థంగా పని చేసే కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, టీడీపీ కోసం కార్యకర్తలు సర్వం త్యాగం చేశారని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు, తనకు గుర్తింపు తెచ్చింది కార్యకర్తలేనని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడానికి రాజకీయాలు ఉండాలని సూచించారు. ఎక్కువ కాలం సీఎంగా పని చేశానని, తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాత్రింబవళ్లు కష్టపడ్డానని, ఏపీ ప్రజల కోసం ప్రపంచం అంతా తిరిగానని చెప్పారు. ఐదేళ్ల పాటు రాష్ట్రం కోసం ఎంతో శ్రమపడ్డానని, ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టానని గుర్తుచేసుకున్నారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Ananthapuram
Telugudesam
Chandrababu
  • Loading...

More Telugu News