Panchumarthi Anuradha: కనీస జ్ఞానం కూడా లేకుండా కులాల ప్రస్తావన చేశారు: పంచుమర్తి అనురాధ

  • రాజధాని అంశంలో కులాల ప్రస్తావన ఎందుకు?
  • కులాల పేరు చెప్పి రాజధాని లేకుండా చేస్తున్నారు
  • రాజధాని నాశనానికి కంకణం కట్టుకున్నారు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శలు గుప్పించారు. రాజధాని అంశంలో కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. కులాల పేరు చెప్పి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని నాశనానికి జగన్ సర్కారు కంకణం కట్టుకుందని అన్నారు.

అమరావతి ప్రాంతంలో 14 కులాలు ఉన్నాయని... వారిలో రెడ్లు 17 శాతం, కమ్మ 14 శాతం మంది ఉన్నారని అనురాధ తెలిపారు. జగన్ పిచ్చి పీక్స్ కు చేరిందని చెప్పడానికి ఆయన వ్యాఖ్యలే కారణమని చెప్పారు. వైసీపీకి కుల రాజకీయాలు చేయడం తప్ప... రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదని విమర్శించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి కనీస జ్ఞానం కూడా లేకుండా కులాల ప్రస్తావన చేశారని అన్నారు.

Panchumarthi Anuradha
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News