Andhra Pradesh: ప్రజలకు చంద్రబాబు వైకుంఠం చూపిస్తే..జగన్ కైలాసం చూపిస్తున్నారు: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

  • నివేదిక రాకముందే జగన్ ఎందుకు ప్రకటన చేశారు?
  • కర్నూలులో హైకోర్టు ఆలోచనను స్వాగతిస్తున్నాం
  • అమరావతి, విశాఖలల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలి

ఏపీ సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి విమర్శలు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజలకు వైకుంఠం చూపిస్తే, జగన్ పరిపాలనలో మూడు రాజధానులు అంటూ కైలాసం చూపిస్తున్నారని అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై జగన్ ఎందుకు ప్రకటన చేశారు? అని ప్రశ్నించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని, అమరావతి, విశాఖపట్టణాల్లో హైకోర్టు బెంచ్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. అమరావతిలోనే సచివాలయం ఉండాలని, విశాఖలో అసెంబ్లీ, శాసనమండలి ఏర్పాటు చేయాలని అన్నారు.

Andhra Pradesh
Jagan
Congress
Tulasireddy
  • Loading...

More Telugu News