: పార్టీ శ్రేణులకు బాబు హెచ్చరికలు


ఎన్నికలు సమీపిస్తున్నాయని, సీనియర్, జూనియర్ అన్న భేదంలేకుండా అందరూ పార్టీ కోసం శ్రమించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రేణులను హెచ్చరించారు. కార్యకర్తలే కాకుండా నేతలూ కష్టపడాలని బాబు సూచించారు. ఈరోజు తన నివాసంలో బాబు రంగారెడ్డి, హైదరాబాద్ టీడీపీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాలకు ఇన్ ఛార్జిలను నియమించాకే బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు.

  • Loading...

More Telugu News