Rafele fighter jets: ఆ విమానాలు రానివ్వండి.. పాక్‌లోని ఉగ్రవాదుల పనిపడతాం: రాజ్‌నాథ్‌సింగ్
- రాఫెల్ యుద్ధ విమానాలు వస్తే వైమానిక దళం బలపడుతుంది
- సరిహద్దు దాటకుండానే ఉగ్రశిబిరాలు ధ్వంసం చేస్తాం
- న్యూయార్క్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్
రాఫెల్ యుద్ధ విమానాలు ఒకసారి భారత వైమానిక దళంలో చేరాక పాక్‌లోని ఉగ్రవాదుల పనిపడతామని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. రాఫెల్ విమానాలు వస్తే వైమానిక దళ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందన్నారు. విమానాలు చేతికి అందిన తర్వాత సరిహద్దులు దాటకుండానే పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తామన్నారు. గీత దాటకుండానే ఉగ్రశిబిరాల భరతం పట్టే అవకాశం లభిస్తుందన్నారు.
రాజ్‌నాథ్ ప్రస్తుతం న్యూయార్క్‌లో ఉన్నారు. భారత్-అమెరికా మధ్య జరగనున్న 2 ప్లస్ 2 చర్చల్లో మంత్రి పాల్గొంటారు. న్యూయార్క్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక మందగమనం ప్రభావం భారత్‌పైనా ఉందన్నారు. ఈ పరిస్థితుల నుంచి భారత్ త్వరగానే బయటపడుతుందని రాజ్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు.