south africa: దక్షిణాఫ్రికాలో హిందూ జాతీయ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో పోటీ!

  • ద హిందూ యూనిటీ మూవ్‌మెంట్ పేరుతో పార్టీ నమోదు
  • అధ్యక్షుడిగా రామ్ మహారాజ్
  • హిందువుల ఆకాంక్షలు నెరవేర్చేందుకే పార్టీని స్థాపించామన్న జాతీయ నేత జయరాజ్

దేశానికి ఆవల హిందూ జాతీయ పార్టీ ఒకటి ఆవిర్భవించింది. ‘ద హిందూ యూనిటీ మూవ్‌మెంట్ (హెచ్‌యూఎం) పేరుతో దక్షిణాఫ్రికా ఎన్నికల సంఘం వద్ద ఒక రాజకీయ పార్టీ నమోదైంది. దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ అధ్యక్షుడు రామ్ మహారాజ్ ఈ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

హిందువుల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పార్టీని స్థాపించినట్టు ఆ పార్టీ జాతీయ నేత జయరాజ్ బచ్చు తెలిపారు. హిందువులను స్థానిక, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో భారతీయ భాషలను పాఠ్యాంశాలుగా మళ్లీ చేర్చడంతోపాటు దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించడమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్న జయరాజ్.. వచ్చే ఏడాది జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో హెచ్‌యూఎం పోటీ చేస్తుందని తెలిపారు.

south africa
Hindu political party
HUM
  • Loading...

More Telugu News