Vishnu Vardhan Reddy: పాకిస్థాన్ కు శాపనార్థాలు పెట్టిన ఏపీ బీజేపీ నేత!

  • ముషారఫ్ కు మరణశిక్షపై స్పందించిన విష్ణువర్ధన్ రెడ్డి
  • ఇదేం దేశమో అర్థం కాదని విస్మయం
  • మీరు బాగుపడరు, మీ దేశం బాగుపడదంటూ ఫేస్ బుక్ లో పోస్టు

పొరుగుదేశం పాకిస్థాన్ పై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మాజీ మిలిటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కు పాక్ లోని ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించడం పట్ల ఆయన స్పందించారు. అసలు ఇదేం దేశమో అర్థం కాదని విష్ణువర్ధన్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. మహిళలు, చిన్నపిల్లలు అనే తేడా లేకుండా చంపేస్తుంటారని, కనీసం రాజకీయ నాయకులైనా భద్రంగా ఉంటారా అంటే అదీ లేదన్నారు. మాజీ ప్రధాని భుట్టోని బాంబులు పేల్చి లేపేశారని అన్నారు. 'ఇప్పుడు ముషారఫ్ కు మరణశిక్ష వేశారు, మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నారు... మీరు బాగుపడరు, మీ దేశం బాగుపడదు' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

Vishnu Vardhan Reddy
BJP
Andhra Pradesh
Pakistan
Parvez Musharraf
Nawaz Sharif
  • Loading...

More Telugu News