Venky Mama: 'వెంకీ మామ'ను కొనియాడిన మహేశ్ బాబు

  • ఇటీవలే విడుదలైన 'వెంకీ మామ'
  • సరైన వినోదం అంటూ మహేశ్ బాబు ట్వీట్
  • వెండితెర వెలిగిపోయేలా నటించారంటూ కామెంట్

సక్సెస్ టాక్ తో కలెక్షన్లు రాబడుతున్న 'వెంకీ మామ' చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. సరైన వినోదం కావాలంటే 'వెంకీ మామ' చిత్రం చూడాల్సిందేనని ట్వీట్ చేశారు. ఈ సినిమాను నిజంగా ఎంతో ఆస్వాదించానని వెల్లడించారు. మామ-అల్లుడు కెమిస్ట్రీతో వెంకటేశ్ గారు, నాగచైతన్య వెండితెరను జిగేల్మనిపించారని కితాబిచ్చారు. భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలు పక్కాగా పండిన నికార్సయిన సినిమా 'వెంకీ మామ' అని మహేశ్ బాబు కొనియాడారు. చిత్ర యూనిట్ మొత్తానికి శుభాభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

Venky Mama
Venkatesh
Naga Chaitanya
Mahesh Babu
Tollywood
  • Loading...

More Telugu News