citizenship act: సీఏఏపై ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు

  • హింసాత్మక ఘటనలు జరగకుండా నివారించండి
  • ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టండి
  • అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వ శాఖ సూచన

ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వం సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. హింసను ప్రేరేపించేలా అసత్య వార్తలు ప్రసారం చేసేవారిపైనా, సోషల్ మీడియా పోస్టులపైనా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ సూచించింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా, రెండు రోజుల క్రితం ఢిల్లీ, హైదరాబాద్‌కూ నిరసనలు పాకాయి. ఢిల్లీలో జేఎంఐ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.

citizenship act
Home ministry
  • Loading...

More Telugu News