Amit Shah: విద్యార్థులు కొత్తగా వచ్చిన పౌరసత్వ చట్టాన్ని ఓసారి చదవాలి: అమిత్ షా

  • పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన కేంద్రం
  • దేశంలోని అనేక ప్రాంతాల్లో నిరసనలు
  • స్పందించిన అమిత్ షా

తాము తీసుకుచ్చిన నూతన పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. మతపరమైన హింసను ఎదుర్కొంటున్నవారికి దేశ పౌరసత్వం కల్పించాలన్న సదుద్దేశంతో చట్ట సవరణ చేశామే తప్ప, ఏ ఒక్కరి పౌరసత్వాన్ని రద్దు చేయటానికో ఈ చట్టం తీసుకురాలేదని స్పష్టం చేశారు.

విద్యార్థులు సవరించిన పౌరసత్వ చట్టాన్ని ఓసారి చదవాలని సూచించారు. అందులోని అంశాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని తెలిపారు. రాజకీయ పార్టీలు స్వప్రయోజనాల కోసం దుష్ప్రచారాలు చేస్తుంటాయని, వాటి ఉచ్చులో విద్యార్థులు చిక్కుకోరాదని హితవు పలికారు. ఝార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News