Kanna Lakshminarayana: చట్టం చేయడం గొప్ప కాదు, అమలు చేయడం గొప్ప: కన్నా

  • గుంటూరు అత్యాచార బాధిత బాలికకు పరామర్శ
  • బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
  • మరణదండనే పరిష్కారమని వ్యాఖ్యలు

గుంటూరు అత్యాచార బాధిత బాలికను బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పరామర్శించారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక పరిస్థితిని వైద్యులనడిగి తెలుసుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. సమాజంలో యథేచ్ఛగా అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ చట్టం చేసిన తొలి రోజే బాలికపై దారుణం జరిగిందని అన్నారు. చట్టం చేయడం గొప్పకాదు, చట్టం అమలు చేయడమే గొప్ప అని హితవు పలికారు. ఇలాంటి ఘటనల్లో మరణదండనే పరిష్కారం అని కన్నా అభిప్రాయపడ్డారు.

Kanna Lakshminarayana
BJP
Guntur
GGH
Andhra Pradesh
YSRCP
Jagan
Disha
Act
  • Loading...

More Telugu News