Chittoor District: ఈ నెల 26న సూర్యగ్రహణం.. తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • గ్రహణానికి 6 గంటల ముందు నుంచి ఆలయం మూత
  • ఉదయం 8.08 - 11.16 గంటల వరకు గ్రహణం
  • మధ్యాహ్నం 12 తర్వాత ఆలయశుద్ధి, 2 గంటల నుంచి స్వామి వారి దర్శనం

ఈ నెల 26న సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు మాట్లాడుతూ, పదమూడు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని చెప్పారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి ఆరుగంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేస్తామని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆలయశుద్ధి, 2 గంటల నుంచి స్వామి వారి దర్శనం మొదలవుతుందని, ఆలయ తలుపులు మూసిన సమయంలో అన్నప్రసాదం వితరణ నిలిపివేస్తామని వివరించారు. గ్రహణం కారణంగా తిరుప్పావడ, కల్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలు రద్దు చేసినట్టు చెప్పారు.

Chittoor District
Tirupati
Tirumala
TTD
Eclipse
  • Loading...

More Telugu News