Kerala: కేరళ విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి మృతి

  • జలపాతంలో పడి శ్రీహర్ష అనే విద్యార్థి మృతి
  • శ్రీహర్ష స్వస్థలం కరీంనగర్
  • కోయంబత్తూరులో ఇంజినీరింగ్ చదువుతున్న శ్రీహర్ష

కరీంనగర్ కు చెందిన శ్రీహర్ష అనే విద్యార్థి కేరళలో ప్రమాదవశాత్తు మరణించాడు. శ్రీహర్ష తమిళనాడులోని కోయంబత్తూరు అమృతపీఠం ఇంజినీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. గత శుక్రవారం సహ విద్యార్థులతో కలసి కేరళ టూర్ కి వెళ్లాడు. అక్కడ కొట్టాయంలోని మర్రిమాల్ జలపాతం వద్ద స్నేహితులతో ఉల్లాసంగా ఉన్న సమయంలో శ్రీహర్ష ఒక్కసారిగా జారిపడ్డాడు. అతడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. స్థానిక మత్స్యకారులు శ్రీహర్ష మృతదేహాన్ని వెలికితీశారు.  

Kerala
Water Falls
Sriharsha
Karimnagar
Telangana
  • Loading...

More Telugu News