Vijay Devarakonda: నా లవర్ గౌతమ్ ను ప్రేమికుల రోజున మీ ముందుంచుతా: రాశి ఖన్నా

  • మరో ప్రేమకథగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • యామిని పాత్రలో రాశి ఖన్నా 
  • ఫిబ్రవరి 14వ తేదీన విడుదల  

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపొందుతోంది. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. కేథరిన్ .. ఐశ్వర్య రాజేశ్ .. ఇజబెల్లా నటిస్తున్నారు. కథానాయికలకి సంబంధించిన ఒక్కో పోస్టర్ ను విడుదల చేస్తూ వస్తున్నారు.

తాజాగా రాశి ఖన్నా పోస్టర్ ను వదిలారు. విజయ్ దేవరకొండను ఆమె ప్రేమగా హత్తుకున్న ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. 'మీట్ మై వరల్డ్ ఫేమస్ లవర్ గౌతమ్ .. ఇతన్ని ప్రేమికుల రోజున మీ ముందుంచుతాను' అని రాశి ఖన్నా ట్వీట్ చేసింది. ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాలో, యామినిగా రాశి ఖన్నా .. గౌతమ్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు. వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Vijay Devarakonda
Rasi Khanna
Catherine
Aishvarya Rajesh
  • Loading...

More Telugu News