Guntur District: అదనపు కట్నం కోసం వేధింపులు.. భార్యను చంపబోయిన ఎంపీడీవో!

  • తాగొచ్చి అదనపు కట్నం కోసం భార్యతో గొడవ
  • కత్తితో చేతులు, వీపుపై గాయాలు
  • ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన బాధితురాలు

అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతో పాటు ఆమెపై హత్యాయత్నానికి పాల్పడిన ఎంపీడీవోపై కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్‌, గుంటూరుకు చెందిన మేరీ కుమారి భార్యాభర్తలు. 2018లో వీరికి వివాహం కాగా, కాగజ్‌నగర్‌లోని శ్రీరాంనగర్‌ కాలనీలో నివసిస్తున్నారు. జగదీశ్ ప్రస్తుతం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు (టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నాడు.

శుక్రవారం రాత్రి తాగిన మత్తులో ఇంటికి వచ్చిన జగదీశ్.. అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యతో గొడవపడ్డాడు. అక్కడితో ఆగక ఆగ్రహంతో ఊగిపోతూ ఇంట్లోని కత్తితో భార్యపై దాడికి దిగాడు. దీంతో ఆమె చేతులు, వీపుపై గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలు మేరీకుమారి ఆదివారం ఎస్పీ మల్లారెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది. జగదీశ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Guntur District
kagaznagar
husband
wife
Crime News
  • Loading...

More Telugu News