apsrtc: ఏపీఎస్ ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసన.. బస్సులో ప్రయాణించిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు

  • పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ప్రయాణం
  • పాలకొల్లు బస్టాండులో ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే
  • వెంటనే తగ్గించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బస్సులో ప్రయాణించారు. పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ఇతర ప్రయాణికులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అలాగే, పాలకొల్లు బస్టాండులో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ధరలతో ప్రజలపై వెయ్యి కోట్ల రూపాయల భారం పడుతుందని, వెంటనే తగ్గించాలని రామానాయుడు డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సు కనీస చార్జీలను 50 శాతం పెంచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చార్జీలు పెంచడం దారుణమని, చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

apsrtc
bus charges
Ramanaidu
  • Loading...

More Telugu News