Chennai: చెన్నై వన్డేలో అలవోకగా గెలిచిన విండీస్... హోప్, హెట్మెయర్ సెంచరీల మోత

  • తొలి వన్డేలో టీమిండియా ఓటమి
  • 8 వికెట్ల తేడాతో విండీస్ విజయం
  • మరో 13 బంతులు మిగిలుండగానే గెలుపు అందుకున్న కరీబియన్లు

టీమిండియాకు సొంతగడ్డపై పరాజయం ఎదురైంది. కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సొంతగడ్డపై రాణిస్తున్న భారత్ జట్టుకు వెస్టిండీస్ పరాజయాన్ని రుచి చూపించింది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చెన్నైలో జరిగిన తొలి మ్యాచ్ లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 288 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్ షాయ్ హోప్ (102 నాటౌట్), వన్ డౌన్ బ్యాట్స్ మన్ షిమ్రోన్ హెట్మెయర్ (106 బంతుల్లో 139; 11 ఫోర్లు, 7 సిక్సులు ) సెంచరీలతో రాణించడంతో విండీస్ మరో 13 బంతులు మిగిలుండగానే గెలుపుతీరాలకు చేరింది. ఆ జట్టు 47.5 ఓవర్లలో 2 వికెట్లకు 291 పరుగులు చేసింది.

నికోలాస్ పూరన్ 23 బంతుల్లో 4 ఫోర్లతో 29 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శివమ్ దూబే విసిరిన ఇన్నింగ్స్ 48వ ఓవర్లో పూరన్ 3 బౌండరీలు బాదడంతో విండీస్ విజయాన్నందుకుంది. టీమిండియా బౌలర్లలో చహర్, షమీ చెరో వికెట్ తీశారు.

Chennai
India
West Indies
Cricket
Shai Hope
Hetmeyer
  • Loading...

More Telugu News