Ayyappa: 28 రోజుల్లో రూ.100 కోట్లు... ఇది అయ్యప్పస్వామి ఆదాయం!

  • తాజా సీజన్ లో అయ్యప్ప భారీ ఆర్జన
  • నవంబరు 17న తెరుచుకున్న శబరిమల ఆలయం
  • గతేడాది ఇదే సీజన్ లో రూ.64 కోట్ల ఆదాయం

శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్ లో ఆలయం తెరిచిన 28 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయం స్వామివారి ఖాతాలో చేరింది. గత సీజన్ లో ఇదే సమయానికి అయ్యప్ప ఆదాయం కేవలం రూ.64 కోట్లే. ఈసారి అది మరింత పెరిగిందని చెప్పాలి. నవంబరు 17న ఆలయం తెరుచుకోగా, సరిగ్గా ఆదివారం సమయానికి దేవస్థానం ఆదాయం రూ.104.72 కోట్లకు చేరింది. గతేడాది మహిళల ప్రవేశం కారణంగా ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకున్నాయి. దాంతో, భక్తుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం ఆదాయంపైనా పడింది.

Ayyappa
Temple
Sabarimala
Kerala
India
  • Loading...

More Telugu News