Andhra Pradesh: ఏపీ ప్రభుత్వాన్ని ఆకాశానికెత్తేసిన టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా

  • ఇటీవల దిశ చట్టం తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • సర్వత్రా ప్రశంసలు
  • అద్భుతమైన చట్టం అని పేర్కొన్న రాశీ ఖన్నా

అత్యాచార ఘటనల్లో దర్యాప్తు, విచారణ, తీర్పు అన్నీ కేవలం మూడంటే మూడు వారాల్లో ముగిసేలా ఏపీ సర్కారు దిశ చట్టం తీసుకురావడం తెలిసిందే. దీనిపై సర్వత్రా అభినందనలు, ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ యువ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా దిశ చట్టంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం అద్భుతమని కొనియాడారు. ఇతర రాష్ట్రాలు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఇది అమోఘమైన చట్టం అని, నేరం చేస్తే 21 రోజుల్లో శిక్ష విధించే విధానం రావడం ఏపీ ప్రభుత్వం ఘనతేనని తెలిపారు. తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న విషయం దిశ చట్టం కారణంగా స్పష్టంగా బోధపడుతుందని, తప్పుచేయాలనుకున్న వారు తప్పకుండా భయపడతారని అభిప్రాయపడ్డారు.ఇతర రాష్ట్రాలు కూడా దిశ తరహా చట్టాలు రూపొందించి పక్కాగా అమలు చేయాలని పేర్కొన్నారు.

Andhra Pradesh
Disha
Act
Rashi Khanna
Tollywood
  • Loading...

More Telugu News