Samatha: సమత హత్యాచారం... తట్టుకోలేక గుండెపోటుతో మామ మృతి!

  • రెండు వారాల క్రితం ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన
  • అప్పటి నుంచి కుంగిపోయిన మామ ఎల్లయ్య
  • గుండెపోటుతో ప్రాణాలు వదిలిన వైనం

దాదాపు రెండువారాల క్రితం సమతపై జరిగిన హత్యాచారం ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం రేపగా, అదే ఇంట్లో మరో విషాదం నెలకొంది. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ సమీపంలో సమత అత్యాచారం, హత్య జరిగిన సంగతి తెలిసిందే. సమతను కన్న కూతురితో సమానంగా చూసుకునే మామ ఎల్లయ్య, జరిగిన ఘటనను తట్టుకోలేకపోయాడు. దీంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో అనారోగ్యం బారిన పడిన ఆయన, నిన్న గుండెపోటుతో మరణించాడు. సమత మరణం తరువాత ఆయన మానసికంగా కుంగిపోయాడని, ఎంతో దిగాలుగా ఉండేవాడని బంధుమిత్రులు వెల్లడించారు. 20 రోజుల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో గ్రామం మొత్తం కన్నీరు పెట్టుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు, వివరాలు సేకరించారు.

Samatha
Rape
Murder
Heart Attack
Uncle
Kumaram Bheem Asifabad District
  • Loading...

More Telugu News