Three Hands: బాపట్లలో మూడు చేతులతో జన్మించిన వింత శిశువు!

  • మేనరిక వివాహంతో జన్యు లోపాలు
  • శిశువు బతికే అవకాశాలు లేవు
  • తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేకుండా బిడ్డ

బాపట్లలో మూడు చేతులతో ఓ వింత శిశువు జన్మించింది. ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఈ ఘటన జరుగగా, జన్యుపరమైన లోపాల కారణాలతో ఇలా జరిగిందని వైద్యాధికారులు వెల్లడించారు. ఈ విషయమై ఆసుపత్రి వైద్యురాలు మాట్లాడుతూ, ఈ దంపతులది మేనరిక వివాహమని తెలిపారు. మరిన్ని వివరాలను వెల్లడించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించని కారణంగా, వారి పేర్లను బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు.

ఐదో నెలలో స్కానింగ్ చేసిన సమయంలో ఈ లోపాన్ని గుర్తించలేదని, ఆపై ఎనిమిదో నెలలో గమనించినా, అప్పటికే ఆలస్యం కావడంతో గర్భస్రావం చేయలేకపోయామని అన్నారు. ఆ మహిళకు సాధారణ కాన్పే జరిగిందని, శిశువు ఆరోగ్యం విషమంగా ఉందని, బతికే అవకాశాలు స్వల్పమని అన్నారు. ఇదే దంపతులకు మూడు సంవత్సరాల క్రితం తొలి కాన్పులో కాళ్లు, చేతులు లేకుండా మగబిడ్డ పుట్టి చనిపోయాడని ఆమె తెలిపారు.

Three Hands
Bapatla
Hospital
Delivery
  • Loading...

More Telugu News