Bandaru Appalanaidu: కారు యాక్సిడెంట్ చేసి పారిపోయిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు!

  • విశాఖ బీచ్ రోడ్ లో ఘటన
  • అదుపుతప్పి బైక్ ను ఢీకొట్టిన కారు
  • మద్యం మత్తులోనే ప్రమాదమంటున్న స్థానికులు

విశాఖ బీచ్ రోడ్డులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడు, తన వాహనంతో యాక్సిడెంట్ చేశారు. ఘటనను చూసిన స్థానికులు అప్పలనాయుడు మద్యం తాగి ఉన్నాడని గమనించి దేహశుద్ధి చేయగా, తన అనుచరుల సాయంతో ఆయన అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయినట్టు తెలుస్తోంది. ర్యాష్ డ్రైవింగే ప్రమాదానికి కారణమని, అదుపుతప్పిన అప్పలనాయుడు కారు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా, దానిపై ప్రయాణిస్తున్న యువకుడికి గాయాలు అయ్యాయని, అతన్ని ఆసుపత్రికి తరలించామని స్థానికులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని, ప్రమాదానికి గురైన కారును స్టేషన్ కు తరలించే ఏర్పాట్లలో ఉన్నారు. ఈ కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి, దానిపై ఏర్పాటు చేసివున్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని తాకిందని, ఈ విషయంలో కేసు నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

Bandaru Appalanaidu
Bandaru Satyanarayana
Car Accident
Vizag
Police
  • Loading...

More Telugu News