Five years Old Raped by a man in Guntur: చట్టాలను పటిష్టం చేస్తున్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు ఆగటంలేదు: నారా లోకేశ్ ఆవేదన

  • ‘దిశ’ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే చోటుచేసుకోవడం విచారకరం
  • ఆ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది
  • నిందితుడికి 21రోజుల్లోనే శిక్ష పడేలా చేయాలి

దిశ బిల్లుని శాసనసభలో ఆమోదించిన రోజే ఐదేళ్ల బాలికపై అత్యాచార ఘటన  జరగడం తనను కలచివేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఏపీ శాసనసభలో దిశ బిల్లు ఆమోదించిన రోజున గుంటూరులో బాలికపై లక్ష్మారెడ్డి అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే.

ఒక వైపు మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చట్టాలను పటిష్టం చేస్తున్నప్పటికీ నేరాలు ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టం ప్రకారం నిందితుడికి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని సీఎం జగన్ ను కోరారు. మహిళలు బయటకు వెళ్లాలంటే జంకాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు.

Five years Old Raped by a man in Guntur
Nara Lokesh codemn
  • Loading...

More Telugu News