Balakrishna: బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి.. కల్మషం వుండదు: జీవిత

  • వైజాగ్ లో రూలర్ ప్రీరిలీజ్ ఈవెంట్
  • హాజరైన జీవిత, రాజశేఖర్
  • బాలయ్యపై పొగడ్తలు

వైజాగ్ లో నందమూరి బాలకృష్ణ 'రూలర్' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు నటి జీవిత, ఆమె భర్త హీరో రాజశేఖర్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై జీవిత మాట్లాడుతూ, బాలయ్యతో తాను తిరగబడ్డ తెలుగుబిడ్డ చిత్రంలో చెల్లెలిగా నటించానని గుర్తుచేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన మనస్తత్వంలో ఎలాంటి మార్పులేదని అన్నారు. మనసులో ఒకటుంచుకుని, బయటికి మరోలా మాట్లాడే వ్యక్తి కాదని, ఆయన మనసులో ఎలాంటి కల్మషం ఉండదని అన్నారు. బాలయ్య చిన్నపిల్లవాడు లాంటి వ్యక్తి అని, చూడగానే ఎంతో ఆప్యాయంగా నవ్వుతారని తెలిపారు.

మనసులో ఏమున్నా ఓపెన్ గా చెప్పేస్తారని, ఆ అదృష్టం చిన్నపిల్లలకే ఉంటుందని అనుకుంటామని, కానీ బాలయ్యకు కూడా ఆ అదృష్టం ఉందని వివరించారు. తన కుమార్తెలు కూడా సినీ రంగంలోనే ఉన్నారన్న జీవిత, ఇదే విషయాన్ని బాలకృష్ణతో చెబితే తన పక్కన ఎప్పుడు హీరోయిన్లుగా చేస్తారని అడిగారని వెల్లడించారు. బాలయ్యను చూస్తుంటే వయసు అస్సలు తెలియడంలేదని పొగిడారు.

Balakrishna
Jeevitha
Rajasekhar
Tollywood
Ruler
Vizag
  • Loading...

More Telugu News