Gujarath: 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారైన గుజరాత్ యువకుడు!

  • అత్యంత పిన్న వయసులో ఐపీఎస్ అధికారిగా హసన్ రికార్డు
  • ఈ నెల 23న జామ్ నగర్ ఏఎస్పీగా బాధ్యతల స్వీకరణ
  • గత ఏడాది యూపీఎస్సీ పరీక్షల్లో 570 ర్యాంకు పొందిన హసన్

దేశంలోనే అత్యంత పిన్న వయసులోనే ఐపీఎస్ అధికారిగా ఎంపికై గుజరాత్ కు చెందిన యువకుడు రికార్డు సృష్టించాడు. పాలంపూర్ లోని కనోదర్ గ్రామానికి చెందిన 22ఏళ్ల హసన్ సఫిల్ గత ఏడాది నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షల్లో 570వ ర్యాంకును పొందాడు. అనంతరం అతడు ఐపీఎస్ అధికారి పోస్టుకు ఎంపికయ్యాడు. శిక్షణ పూర్తి చేసుకున్న హసన్ ఈ నెల 23న జామ్ నగర్ ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా హసన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యం ఉండేది. అది సాధ్యం కాలేదు. చివరకు ఐపీఎస్ గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నా. నా తల్లి నసీంబాను,తండ్రి ముస్తఫాలు ఓ వజ్రాల కంపెనీకి చెందిన చిన్నయూనిట్లో పనిచేస్తుంటారు. వారితో పాటు నా కల నెరవేరటానికి పలువురు వ్యాపారులు ఆర్థిక సాయం చేశారు. వారికి రుణపడి ఉంటాను’ అని చెప్పాడు.

Gujarath
22 years old youth became IPS Officer
  • Error fetching data: Network response was not ok

More Telugu News