Ramcharan: బాలీవుడ్ పాటకు సానియా మీర్జాతో డ్యాన్స్ చేసిన రామ్ చరణ్... వీడియో ఇదిగో!

  • ఇటీవలే సానియా సోదరి ఆనమ్ పెళ్లి రిసెప్షన్
  • సతీసమేతంగా హాజరైన రామ్ చరణ్
  • వీడియో ట్వీట్ చేసిన ఉపాసన

హైదరాబాద్ లో జరిగిన సానియా మీర్జా సోదరి ఆనమ్ పెళ్లి రిసెప్షన్ లో టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ సందడి అంతా ఇంతా కాదు. సానియా మీర్జాకు అత్యంత సన్నిహిత మిత్రుడైన రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి ఈ రిసెప్షన్ కు విచ్చేశాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తున్నాయి. తాజాగా రామ్ చరణ్ డ్యాన్స్ వీడియో కూడా బయటికి వచ్చింది. ఈ వీడియో షేర్ చేసింది ఎవరో కాదు... చెర్రీ భార్య ఉపాసనే. రాకింగ్ ద డ్యాన్స్ ఫ్లోర్ అంటూ ఉపాసన వీడియో ట్వీట్ చేసింది. ఈ వీడియోలో ఓ బాలీవుడ్ హిట్ సాంగ్ కు సానియా మీర్జా, బాలీవుడ్ సెలబ్రిటీ ఫరాఖాన్ లతో కలిసి రామ్ చరణ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. సానియా సైతం చరణ్ సరసన తనకొచ్చిన స్టెప్పులు వేసి అలరించింది.

Ramcharan
Sania Mirza
Anam Mirza
Upasana
Farah Khan
Bollywood
  • Loading...

More Telugu News