Mukkoti: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీవారు పదిరోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి వచ్చివెళతారు: చినజీయర్ స్వామి

  • పదిరోజుల పాటు వైకుంఠ దర్శనాలు చేసుకోవచ్చన్న చినజీయర్ స్వామి
  • ఉత్సవమూర్తులకు అభిషేకాలు తగ్గించుకోవాలని సూచన
  • ఈ నెల 16 నుంచి అమెరికాలో ప్రత్యేక పూజలు

ముక్కోటి ఏకాదశి, తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం అంశాలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి స్పందించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారు పది రోజుల పాటు వైకుంఠద్వారం నుంచి వచ్చి వెళతారని వివరించారు. ఈ పది రోజుల పాటు శ్రీవారి వైకుంఠ దర్శనాలు చేసుకోవచ్చని తెలిపారు.

ఇక, ఉత్సవమూర్తులకు అభిషేకాలు తగ్గించుకోవాలని ఆలయ వర్గాలకు సూచించారు. ఎక్కువ అభిషేకాలతో ఉత్సవమూర్తులకు నష్టం కలిగే ప్రమాదం ఉందని అన్నారు. ఏడాదికి 45 అభిషేకాలు చేస్తే సరిపోతుందని చినజీయర్ స్వామి అభిప్రాయపడ్డారు. కాగా, ఈ నెల 16 నుంచి 30 వరకు అమెరికాలో చినజీయర్ స్వామి ప్రత్యేకంగా ధనుర్మాస పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గుంటూరులో జనవరి 1 నుంచి 15 వరకు పూజలు ఉంటాయి.

Mukkoti
Ekadasi
Tirumala
Chinna Jeeyar Swami
USA
Guntur
  • Loading...

More Telugu News