: ఆర్ట్ డైరక్టర్ కళాధర్ మృతికి హరికృష్ణ సంతాపం
అలనాటి సుప్రసిద్ధ ఆర్ట్ డైరక్టర్ కళాధర్ మృతి పట్ల నందమూరి హరికృష్ణ సంతాపం తెలియజేశారు. ఆయనతో తమకు ఎంతోకాలం నుంచి అనుబంధం ఉందని హరికృష్ణ చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళాధర్ ఈ సాయంత్రం చెన్నైలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన పలు హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు. పాతాళభైరవి, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ, షావుకారు వంటి చిత్రాలకు కళాదర్శకత్వం వహించారు.