New Delhi: మరో రెండేళ్లలో నూతన భవనంలో పార్లమెంటు సమావేశాలు: లోక్ సభ స్పీకర్

  • 2022 నాటికి  కొత్త భవనం సిద్ధం 
  • ప్రధాని ఈ మేరకు సమ్మతి తెలిపారు
  • అత్యాధునిక సమావేశ మందిరంగా అందుబాటులోకి

మరో రెండేళ్లలో పార్లమెంటు సమావేశాలు నూతన భవనంలో నిర్వహించుకోనున్నామని లోకసభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. 2022 నాటికి కొత్త భవనం సిద్ధమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ తెలిపారని ఈ సందర్భంగా స్పీకర్ వివరించారు. కొత్త భవనం అత్యాధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులోకి రానుందన్నారు. ప్రస్తుతం చారిత్రక ఎర్రకోటలో భాగంగా ఉన్న పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీని స్థానంలో నూతన భవన నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం యోచిస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే రెండు మూడు స్థలాలు పరిశీలించారు. ఇందులో ఒకదాన్ని ఎన్నుకుని నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న లోక్ సభ సమావేశాలు పూర్తయిన తర్వాత స్పీకర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నూతన భవనంలో అత్యాధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుందని తెలిపారు.

అలాగే పూర్తి డిజిటలైజేషన్‌తో కాగిత రహితంగా నిర్వహించనున్నటు తెలిపారు. 1858 వరకు బ్రిటిష్ కాలంలో జరిగిన చర్చలు, ప్రధాన ఘట్టాల డిజిటలైజేషన్ ఇప్పటికే పూర్తయిందని, మిగిలిన సమావేశాల డిజిటలైజేషన్ కూడా సత్వరం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నూతన భవనంలో సభ్యులకు వైఫై అందుబాటులోకి వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News