I Phone order duplicate Phone delivered: ఐఫోన్ కు ఆర్డరిస్తే.. నకిలీ ఫోన్ డెలివరీ

  • ప్రముఖ ఆన్ లైన్ సంస్థ నిర్వాకం
  • రూ.93వేలు చెల్లించిన బాధితుడు
  • ఫిర్యాదుచేస్తే.. కొత్తది పంపిస్తామన్న సంస్థ

రూ.93వేలు పెట్టి ఐఫోన్ కొనుక్కుందామన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆన్ లైన్ సంస్థ డెలివరీ చేసిన ఫోన్ ను  చూసి హతాశుడయ్యాడు. బెంగళూరుకు చెందిన రజనీకాంత్ కుశ్వాహా ఇటీవల ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 11ప్రో కోసం ఆర్డర్ చేసి రూ.93వేలు చెల్లించాడు. కొన్ని రోజుల తర్వాత సంస్థ డెలీవరీ చేసిన ఫోన్ ప్యాక్ ను తెరచి చూడగా అది నకిలీదని తేలింది. ఫోన్ ఆన్ చేసి చూడగా అది అసలు ఐవోఎస్ తో పనిచేసే ఫోన్ కాదని తేలింది. అంతేకాక, ఐఫోన్ 11 ప్రోకు ఉండే మూడు కెమెరాల సెన్సర్లు అతికించి ఉండటాన్ని బాధితుడు గుర్తించాడు. దీనిపై ఫ్లిప్ కార్ట్ కు ఫిర్యాదు చేయగా సంస్థ కొత్త ఫోన్ ఇస్తామని హామీ ఇచ్చిందని రజనీకాంత్ తెలిపాడు.

I Phone order duplicate Phone delivered
Online firm Flip Cart
  • Loading...

More Telugu News