Python: 20 కేజీల కొండచిలువను అవలీలగా పట్టేసిన యువతి... వైరల్ వీడియో!

  • కేరళలోని ఎర్నాకుళంలో ఘటన
  • ఇంటి వెనుక కనిపించిన కొండచిలువ
  • చాకచక్యంతో వ్యవహరించిన విద్య

ఓ చిన్న పాము కనిపిస్తేనే అల్లంతదూరం పరిగెడతాం. అదే కాస్తంత పెద్దదయితే, మరింతగా భయపడతాం. ఇక 20 కిలోల బరువున్న కొండచిలువ కంటి ముందుంటే... ఆ పరిస్థితిని ఊహించుకోలేము కూడా. కానీ, కేరళకు చెందిన ఓ యువతి దాన్ని ప్రాణాలతో బంధించి, తనలోని ధైర్యాన్ని చూపించింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఘటన వివరాల్లోకి వెళితే, బీహార్ కు చెందిన విద్య అనే యువతి ఎర్నాకుళంలో నివాసం ఉంటోంది. తన ఇంటి వెనుకవైపున్న స్థలంలో పెద్ద కొండచిలువ ఉందన్న విషయాన్ని కొందరు గమనించడంతో ఆందోళన మొదలైంది. గతంలో పాములను పట్టడంలో కాస్తంత అనుభవమున్న విద్య, కొండచిలువ మెడను చాకచక్యంగా పట్టుకుని, మరో ఇద్దరి సహకారంతో ఓ సంచీలో పెట్టి బంధించేసింది. దీన్ని హరిందర్ సిక్కా అనే యువకుడు వీడియో తీసి, తన ట్విట్టర్ ఖాతాలో ఉంచగా, ఆమె చూపించిన ధైర్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Python
Kerala
Ernakulam
Lady
  • Error fetching data: Network response was not ok

More Telugu News