Telangana: నిధులు, బకాయిలు విడుదల చేయండి: నిర్మలాసీతారామన్ కు టీఆర్ఎస్ ఎంపీల వినతి

  • సీఎం కేసీఆర్ రాసిన లేఖను మంత్రికి అందజేసిన ఎంపీలు
  • నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందంటూ ఆరోపణ
  • నిధుల కోసం ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తామన్న ఎంపీలు

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ సభ్యులు ఆమెను కలిసి, నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను మంత్రికి అందజేశారు. అనంతరం టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమయానికి అందేలా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నామా చెప్పారు. నిధులు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం నెలకొల్పే విషయం, మరికొన్ని అంశాలపై కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. నిధులు వచ్చేంతవరకు తాము కేంద్రప్రభుత్వం పట్ల ఇదే వైఖరిని ప్రదర్శిస్తామన్నారు.

Telangana
funds from central govt.
CM KCR written letter submitted to union finance minister Nirmala Sitharaman by TRS MPs
  • Loading...

More Telugu News