Hema Malini: ఈ స్టార్స్ అంతా 'తేనెమనసులు' ఆడిషన్స్ లో ఎంపిక కానివాళ్లే!

  • ఆదుర్తి సుబ్బారావు నుంచి వచ్చిన 'తేనెమనసులు'
  • కొత్త నటీనటులకు అవకాశం 
  • ఈ సినిమాతోనే పరిచయమైన కృష్ణ

తెలుగు తెరకి 'తేనె మనసులు' సినిమాతో కృష్ణ పరిచయమయ్యారు. ఆ సినిమాను గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ప్రస్తావించారు. ''ఆదుర్తి సుబ్బారావుగారు కొత్త నటీనటులతో 'తేనెమనసులు' సినిమాను రూపొందించాలనుకున్నారు. కొత్త నటీనటులు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చారు. అప్పటికే సినిమాల్లో నటించాలనే ఆసక్తి అందరిలో  పెరిగిపోవడంతో ఆడిషన్స్ కి విపరీతంగా వచ్చారు.

అలా వచ్చిన వాళ్లలో హేమమాలిని .. జయలలిత .. కృష్ణంరాజు కూడా వున్నారు. అయితే హీరోయిన్స్ పాత్రలకి జయలలిత .. హేమమాలిని ఇద్దరూ ఓకే కాలేదు. అలాగే హీరో పాత్రకి కృష్ణంరాజు కూడా ఓకే కాలేదు. కానీ ఆ తరువాత కాలంలో ఈ ముగ్గురూ చిత్రపరిశ్రమలో ఏ స్థాయికి చేరుకున్నారన్నది అందరికీ తెలిసిందే. 'తేనె మనసులు' సినిమా కోసం ఎంపికైనవారిలో ఒక్క కృష్ణగారు మాత్రమే సూపర్ స్టార్ గా ఎదిగారు" అని చెప్పుకొచ్చారు.

Hema Malini
Jayalalitha
Krishnam Raju
  • Loading...

More Telugu News