chevireddy: ఇదే శాసనసభకు మేము నల్ల బ్యాడ్జీలు వేసుకొని వస్తే మంగళగిరి పీఎస్ కు తరలించారు: చెవిరెడ్డి

  • తనను మార్షల్స్‌ తాకారని, తోసేశారని చంద్రబాబు అంటున్నారు
  • గతంలో మాపై దారుణంగా ప్రవర్తించారు
  • చిత్తూరులో ధర్నా చేస్తే పోలీసు బస్సులో ఎక్కించుకెళ్లారు
  • తమిళనాడులో రాత్రంతా తిప్పారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. తనను మార్షల్స్‌ తాకారని, తోసేశారని చంద్రబాబు అంటున్నారని, గతంలో ఇదే శాసనసభలో తాము నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని వస్తే తమను మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని చెప్పారు.

అంతేగాక, తమ పార్టీ  కార్యకర్తల ఓట్లు తొలగిస్తున్నారని తాను గతంలో చిత్తూరులో ధర్నా చేస్తే రాత్రి సమయంలో పోలీసు బస్సులో ఎక్కించుకొని తమిళనాడుకు తీసుకెళ్లారని, ఆ రాత్రంతా బస్సులోనే తిప్పారని చెవిరెడ్డి చెప్పారు. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం తనపై చాలా క్రూరంగా ప్రవర్తించిందని అన్నారు. తాను గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు పడ్డానన్నారు. గతంలో తాను తిరుపతి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసనకు దిగినప్పటి సందర్భాన్ని కూడా ఆయన గుర్తు చేస్తూ ఆ సమయంలో సబ్‌ కలెక్టర్‌ చేతికింది ఉద్యోగిని కులం పేరుతో దూషించానని తప్పుడు కేసు పెట్టారని అన్నారు.

chevireddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News