Onion: ఉల్లి నిత్యావసర వస్తువు కాదు: ఏపీ మంత్రి కన్నబాబు

  • కేంద్రం పరిమిత కాలానికి మాత్రమే చేర్చింది
  • బియ్యం, గోధుమ, మంచినూనె వంటివే ఆ కేటగిరీలోవి
  • ఇది తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారు

ఉల్లి నిత్యావసర వస్తువు కాదని, 2014లో కేంద్రం అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పరిమిత కాలానికి మాత్రమే దీన్ని నిత్యావసర జాబితాలో చేర్చిందని ఏపీ వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఈ విషయం కూడా తెలియకుండా కొంతమంది నాయకులు నానా యాగీ చేస్తున్నారంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై పరోక్షంగా విమర్శలు కురిపించారు. ప్రస్తుతానికైతే బియ్యం, గోధుమలు, నూనె వంటివి మాత్రమే నిత్యావసరాల్లో ఉన్నాయన్న విషయాన్ని సదరు వ్యక్తులు గుర్తించాలని కోరారు. ఉల్లి నిత్యావసర వస్తువుల జాబితాలో ఉందో, లేదో కూడా తెలియకుండా మాట్లాడవద్దని కోరారు.

Onion
kurasala kannababu
Pawan Kalyan
  • Loading...

More Telugu News