Ulli: ధరా భారం...ఏపీలో పాలన ఘోరం: ఎస్ఎఫ్ఐ వినూత్న నిరసన

  • ఉల్లి ధరను అదుపు చేయలేకపోయారు 
  • ఆర్టీసీ రేట్లు పెంచి అదనపు భారం మోపారు 
  • ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై మల్లయుద్ధం

ఆంధ్రప్రదేశ్ లో ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని, ఇది చాలదన్నట్లు ఆర్టీసీ టికెట్ల ధర పెంచి అదనపు భారం మోపిందంటూ విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ఈ రోజు గుంటూరు పట్టణంలో వినూత్న నిరసన తెలిపింది. నడిరోడ్డుపై మల్లయుద్ధం చేస్తూ ధరలతో ప్రజలు చేస్తున్న యుద్ధాన్ని కళ్లకు కట్టారు. వామపక్షాల నిరసనకు సంఘీభావం ప్రకటించిన విద్యార్థి సంఘం రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో సామాన్యుడు వాటితో యుద్ధం చేయాల్సి వస్తోందని చెబుతూ ఉల్లిపాయ ట్రోఫీ కోసం పోటీలు నిర్వహించారు. ఉల్లిపాయల కోసం సాధారణ ప్రజలు రైతుబజార్లలో పడుతున్న పాట్లను వివరించారు.

Ulli
SFI
guntur
agitation
  • Loading...

More Telugu News